![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -700 లో.....దీప కళ్ళు తిరుగుతున్నాయని అనడంతో కార్తీక్ వెంటనే తనని కూర్చొపెట్టి నిమ్మకాయ వాటర్ తీసుకొని వస్తాడు. నువ్వు వట్టిమనిషివి కూడా కాదు.. ఎందుకిలా చేస్తున్నావ్.. రెస్ట్ తీసుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. రేపు ఆర్డర్ కి సంబంధించిన ఏర్పాట్లు చెయ్యాలని దీప అంటుంది. దీప గారు మీరు వెళ్ళండి.. నేను చూసుకుంటానని సూరజ్ అంటాడు. తర్వాత కార్తీక్ మీరు కూడా వెళ్ళండి అని సూరజ్ అనగానే డ్రైవర్ గా నువ్వు చేస్తావా అని జ్యోత్స్న అంటుంది. డ్రైవర్ లు కూడా లీవ్ తీసుకోవచ్చని కీస్ తన చేతిలో పెట్టి దీపని తీసుకొని కార్తీక్ అక్కడ నుంచి వెళ్తాడు.
ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి శివన్నారాయణ వస్తాడు. అప్పుడే జ్యోత్స్నకి పిజ్జా ఆర్డర్ వస్తుంది. అది చూసి ఎవరు ఆర్డర్ చేశారని శివన్నారాయణ అడుగుతాడు. గ్రానీ అయి ఉంటుందని జ్యోత్స్న అనగానే నేనే ఆర్డర్ చేసానని సూరజ్ అంటాడు. మన రెస్టారెంట్ నుంచి చేసానని సూరజ్ అంటాడు. బయట రెస్టారెంట్ నుంచి చేస్తే కూడా వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో తెలిసేది కదా అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ వెళ్ళాక నువ్వు ముందు పిజ్జా తిను అని సూరజ్ అంటాడు. ఆ తర్వాత సూరజ్ చేతికి ఉన్న కట్టు విప్పుతాడు. అప్పుడే అక్కడ క్లర్క్ చూసి మీ దెబ్బ ఏమైందని అడుగుతాడు. మేడం గారి చేత్తో పిజ్జా ఇచ్చింది తగ్గిందని సూరజ్ చెప్తాడు. అయితే నాకు తలనొప్పిగా ఉంది ఒక పిజ్జా ఇవ్వండి అని క్లర్క్ అనగానే జ్యోత్స్న కోప్పడి పంపిస్తుంది. మరొకవైపు కాంచనకి సుమిత్ర ఫోన్ చేసి దీప గురించి కనుక్కుంటుంది. దీప, కార్తీక్, కాంచన ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ఫోన్ మాట్లాడుతారు. సుమిత్రని కన్ఫ్యూషన్ చేస్తారు. ఆ తర్వాత ఎందుకు ఆ సూరజ్ గాడితో గొడవ నువ్వు వాడితో చేతులు కలిపి నీ వైపుకి తిప్పుకున్నావనుకో ఏ ప్రాబ్లమ్ ఉండదని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది.
సూరజ్ కి జ్యోత్స్న ఫోన్ నుంచి పారిజాతం ఫోన్ చేస్తుంటే జ్యోత్స్న లాక్కొని ఫోన్ కట్ చేస్తుంది. దాంతో సూరజ్ ఫోన్ చేసి.. ఎందుకు మిస్డ్ కాల్ ఇచ్చావ్.. నీ వల్ల నా నిద్ర డిస్టబ్ అయింది. అందుకే వేడి పాలు తీసుకొని వచ్చి నాకు సారీ చెప్పి వెళ్ళమని లేదంటే ఈ వీడియో మీ తాతకి చూపిస్తానని సూరజ్ అంటాడు. తప్పక జ్యోత్స్న పాలు పట్టుకొని వెళ్తుంది. నీకు నాకు గొడవ ఎందుకు.. నాతో చేతులు కలుపు.. నేను సీఈఓ అయ్యాక నువ్వు ఏదంటే అది ఇస్తానని జ్యోత్స్న అంటుంది. దానికి సూరజ్ డీల్ బాగుందని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |